Monday, August 4, 2025

వేములవాడ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

వేములవాడ ప్రతినిధి(నిఘా న్యూస్):14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో కొట్లాడిన ఉద్యమకారుడు కెసిఆర్ ను పళ్ళెత్తు మాట అన్న ఊరుకునేది లేదని బిఆర్ఎస్ యువజన నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్ల చేసిన అనుచిత వాక్యలు నిరసిస్తూ మంగళవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాధన ద్యేయంగా కొట్లాడి సాధించి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి గొప్ప పరిపాలన అందించిన కేసీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు ప్రజలు క్షమించరని అన్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిరసన కార్యక్రమంలో వెంగళ శ్రీకాంత్ గౌడ్, బత్తుల మహేందర్ యాదవ్, గుడిసె అరుణ్ కుమార్, తుమ్మల దిలీప్, కొమిరె వెంకట సాయి, పార్వతి మహేష్, షేక్ ఇబ్రహీం, మహమ్మద్ పర్వేజ్, లింగం రాకేశ్, షేక్ రఫీక్.లు ఉన్నారు.

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయకుల బైండోవర్…

తెలంగాణ చౌక్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, బత్తుల మహేందర్ యాదవ్, గుడిసె అరుణ్ కుమార్, తుమ్మల దిలీప్, కొమిరె వెంకట సాయి, పార్వతి మహేష్, షేక్ ఇబ్రహీం, మహమ్మద్ పర్వేజ్, లింగం రాకేశ్, షేక్ రఫీక్ లను వేములవాడ పట్టణ సిఐ కరుణాకర్ డిప్యూటీ తాసిల్దార్ రజిత ముందు హాజరు పరిచి బైండోవర్ చేశారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular