జమ్మికుంట ( నిఘా న్యూస్ ): జమ్మికుంట లోని గాంధీ చౌరస్తాలో ఏ ఎస్సై రవి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నేరమని ఎన్నిసార్లు చెప్పిన మందుబాబుల తీరు మాత్రం అస్సలు మారడం లేదని ఎస్సై అన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా వారు వారి ప్రాణాలనే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతరుల ప్రాణాలకూ ముప్పు కలిగిస్తున్నారు. మైకంతో వాహనాన్ని తోలుతూ అమాయక పాదచారుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. వీరిని నియంత్రించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. మందుబాబుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు అన్నారు.