సంగారెడ్డి (కలం నిఘా న్యూస్) గత కొన్ని రోజులుగా జిల్లాలో, పొరుగు జిల్లాలలో చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది అమాయక ప్రజలను కొడుతున్నారని, మన జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. కావున సంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా.. ఎవరైన చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారనే అనుమానం వచ్చినట్లైతే, అట్టి వ్యక్తులను పట్టుకొని 100 డైల్ కానీ, సమీప పోలీసు స్టేషన్ కు గాని సమాచారం అందించాలని సూచించారు. కానీ కిడ్నాప్ చేస్తున్నారనే అనుమానంతో అమాయక ప్రజలను కొట్టి, ఇబ్బందులకు గురిచేసి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అట్టి వ్యక్తులపై చట్ట రిత్య కఠిన చర్యలుంటాయని తెలియజేశారు.
కిడ్నాప్ అనుమానంతో అమాయకులపై దాడి చేయొద్దు..
RELATED ARTICLES