Friday, February 27, 2026

రాంగపేటలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు..

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో ప్రస్తుతం దసరా శోభ ఉట్టిపడుతోంది. జర్నలిస్టు జాతీయ సంక్షేమ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అర్నకొండలో ప్రతిరోజూ పండుగ వాతావరణం నెలకొంది. భక్తి పాటలు, నృత్యాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడి సందడిని రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు మహిళలు తమ ఆట పాటలతో, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించడానికి నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలతో పాటుగా బతుకమ్మ సంబరాలు కూడా నిర్వహించడం వల్ల గ్రామంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణం మరింత పెంపొందుతోంది. చీకట్ల శ్రీనివాస్ గారు ఈ వేడుకలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు.

రాగంపేట గ్రామంలో జరుగుతున్న ఈ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు స్థానికులకు ఆనందాన్ని, భక్తి భావాన్ని పంచుతూ కన్నుల పండువగా సాగుతున్నాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular