Monday, August 4, 2025

ఇంటి పిల్లర్లను కూల్చి.. భూకబ్జాకు పాల్పడి..

-ఆర్టిఏ మెంబర్ తోట శ్రీపతిరావు అరెస్టుచేసి రిమాండ్ కు తరలింపు

కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ లోని వివేకానందపురి కాలనీకి చెందిన అనుమండ్ల రవీందర్ తండ్రి కొమురయ్య 49 సంవత్సరాలు అను వ్యక్తి 2014 సంవత్సరంలో మే నెలలో తీగల గుట్టపల్లి ప్రాంతంలోని, రోడ్ నం. 16, కార్తికేయ నగర్ లో 233/E నందు 144 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి, ఆ స్థలానికి బేస్మెంట్ నిర్మించుకున్నానని, నవంబర్ 2023వ సంవత్సరంలో బోర్ బావిని కూడా వేయించానని, ఇటీవలె ఇంటి నిర్మాణ కోసమై మున్సిపల్ ఆఫీస్ నుండి అనుమతి కూడా పొంది ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడన్నారు, ఇదిలా ఉండగా గత నెల పదవ తేదీన రాత్రి 10:30 గంటల సమయంలో ఏడు నుంచి 12 మంది గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా తన ఇంటి నిర్మాణ స్థలంలోకి చొరబడి అప్పటికే నిర్మించి ఉన్న 8 పిల్లర్లతో సహా అప్పటికే నిర్మించిన నీటి సంపు, నిర్మాణానికి ఉపయోగించే పరికరాలను నాశనం చేసి దాదాపు 4 లక్షల నష్టం కలుగచేసారని, అట్టి వీడియోలు సైట్ వద్ద వారు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు యందు రికార్డు అయ్యిందని అనుమండ్ల రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పోలీసులు జరిపిన విచారణలో కరీంనగర్ లోని చైతన్యపురి కాలనీకి చెందిన తోట శ్రీపతి రావు, తండ్రి వెంకటేశ్వరరావు వయసు 50 సంవత్సరాలు అనే వ్యక్తి, పొన్నాల కనకయ్య, పవన్ సిరిపురం వెంకటరాజు మరి కొంతమందిని మనుషులను మాట్లాడి ఇంటి నిర్మాణం కూల్చవలసిందిగా ఆదేశించాడని పై నేరానికి పాల్పడ్డాడని తేలినందున U/sec 447,427,120(b) r/వర్క్ 34 of IPC పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. విషయం తెలుసుకుని పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి పట్టుకునేందుకు స్పెషల్ టీం ను సైతం ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు . ఎట్టకేలకు నిందితుడు హైదరాబాద్ లోని అంబర్ పేట్ తన సోదరుని నివాసంలో ఉన్నట్లు గుర్తించిన స్పెషల్ టీం పోలీసులు ఎంతో చాకచక్యంగా సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి మంగళవారం తెల్లవారుజామున కరీంనగర్ కు తీసుకువచ్చారు. నిందితుడిని గౌరవ అడిషనల్ ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ కోర్టులో హాజరుపరచగా కేసును పూర్తిగా పరిశీలించిన గౌరవ మెజిస్ట్రేట్ తోట శ్రీపతిరావు అనే నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular