నూతన తీర్మానాలు అమలు చేస్తాం
డి సి ఎం ఎస్ ఛైర్మెన్ మల్కాపురం శివకుమార్
సంగారెడ్డి (నిఘా న్యూస్):రైతుల సంక్షేమమే ధ్యేయంగా డి సి ఎంఎస్ కృషి చేస్తుందని ఛైర్మెన్ మల్కాపురం శివకుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణం లోని పాత కలెక్టరేటు కాంప్లెక్స్ లో మెదక్ డీసీఎంఎస్ మహాజన సభ నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు డి సి ఎం ఎస్ సేవలు మరింత విస్తరిo చుటకు సభ్యుల సూచనలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి రైతును ఆదుకునేందుకు డి ఎస్ ఎం ఎస్ కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం తరపున మరిన్ని నిధులు తీసుకోవచ్చి రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తామని అన్నారు. డీసీఎంఎస్ మహాజన సభ ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించడం జరిగిందని అన్నారు.ఈ కార్య క్రమంలోఉమ్మడి మెదక్ జిల్లాలోని సహకార సంఘముల అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులు శ్రీ. చిట్టి దేవేందర్ రెడ్డి గారు , డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు శ్ అరిగె రమేష్ కుమార్ గారు, మార్కుఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, డీసీసీబీ డైరెక్టర్ అనంతరెడ్డి గారు,డీసీఎంఎస్ డైరెక్టర్లు, డీసీసీబీ డైరెక్టర్లు, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నరన్నారు
రైతు సంక్షేమానికి డీసీఎంఎస్ కృషి
RELATED ARTICLES