న్యూఢిల్లీ, నిఘా న్యూస్: ఎన్నికలవేళ చత్తీస్గఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొర్చలి. లేదురా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది.పోలీసులు నక్సలైట్లు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నక్సలైట్లు మృత్యువాత పడ్డారు, భారీ సంఖ్యలో మావోయిస్టులకు గాయాలయ్యాయి. ఘటన జరిగినప్పటికీ పోలీసులు ఇంకా అడవిలోనే ఉండి మావోల కదలికలు పరిశీలిస్తున్నారు. సోదాలు నిర్వహిస్తూ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతంలో ఏకే 47 తుపాకీ లభ్యమైంది.
డి ఆర్ జి సి ఆర్ పి ఎఫ్ కు చెందిన కోబ్రా బెటాలియన్, బస్టర్ ఫైటర్స్ బస్తారియా బెటాలియన్, సిఏఎఫ్ సిబ్బంది మావో వ్యతిరేక ఆపరేషన్ కోసం అడవికి వెళ్లాయి గంగలూరు ఏరియా కమిటీ నక్సలైట్లు వీరిపై కాల్పులు జరిపారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు ఇరువైపులా కాల్పులు జరపడంతో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత నలుగురు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు భారీ మొత్తంలో మందు గుండు సామాగ్రిని గుర్తించారు. ఎన్కౌంటర్లో పోలీసులు బలగాలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో గంగలూరు కమిటీ దళానికి భారీ నష్టం వాటిల్లింది కాగా ఎన్కౌంటర్ పై పోలీసులు అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం….