జమ్మికుంట: ఫిబ్రవరి 6( నిఘా న్యూస్ ):జమ్మికుంట:దళిత బంధు లబ్ధిదారులు ఎవరు అధైర్యపడవద్దని త్వరలోనే రెండో విడత డబ్బులను మంజూరు చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వోడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దళిత బంధు పథకంలోని రెండో విడత నిధుల మంజూరు విషయంలో గత బి.ఆర్ ఎస్. ప్రభుత్వం జాప్యం చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. టిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని సూచించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్లు ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
దళిత బంధు లబ్ధిదారులు అధైర్య పడొద్దు:వొడితెల ప్రణవ్
RELATED ARTICLES