కరీంనగర్, నిఘాన్యూస్: సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో కొన్ని కార్యకలాపాలు నిర్ణయించిన సమయంలో పూర్తి చేయాలి. ముఖ్యంగా వైన్ షాపులు, దాబాలు రాత్రి 10 గంటల లోపే మూసేయాలి. కానీ నిర్వాహకులు అవేమీ పట్టించుకోవడం లేదు. తాజాగాకరీంనగర్ రూరల్ ప్రాంతమైన గుంటూరు పల్లి లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పోలీసుల కళ్ళముందే రాత్రి పదిన్నర దాటినప్పటికీ యథేచ్ఛగా షేర్ పంజాబీ ధాబా తమ తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇదేమిటని ప్రశ్నించిన వారిని ఏమైనా చేసుకోండి అని దురుసుగా ప్రవర్తిస్తు్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన బ్లూ కోర్ట్ పోలీసులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి వారిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోని దాబా నిర్వాహకులు
RELATED ARTICLES