Wednesday, March 4, 2026

తెలంగాణ లో మళ్లీ పెరగనున్న కరెంట్ ఛార్జీలు?

హైదరాబాద్, నిఘాన్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మరోసారి సవరించాలని, విద్యుత్తు పంపిణీ సంస్థలు ప్రతిపాదిం చాయి,ప్రస్తుత ఆర్ధిక ఏడాదికి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీకి సమర్పించాయి.పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు, ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిరఛార్జీ కిలోవాట్ కు 40 రూపాయ లు పెంచాలంటూ కోరాయి. 80శాతానికి పైగా ఇండ్లకు 300 యూనిట్ల లోపే ఉండటం వల్ల ఎలాంటి భారం ఉండదని డిస్కంలు వివరించాయి.

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు మరో సారి షాక్ తగలనుంది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబం ధించిన వార్షి ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి అందించాయి.మూడు కేటగిరిల్లో ఛార్జీ లను సవరించాలంటూ ప్రతిపాదించాయి. వీటిని ఈఆర్సీ ఆమోదించినట్ల యితే లోటును పూడ్చుకోవ డానికి రూ. 1200కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి.ఈ ప్రతిపాదనాలపై రాష్ట్రంలో కనీసం మూడు చోట్ల ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపిన అనంతరం ఈఆర్సీ తుది నిర్ణయాన్ని వెల్లడి స్తుంది. ఈఆర్సీ తుది నిర్ణయం అనంతరమే ఛార్జీల సవరణ అమల్లోకి వస్తుంది.

ఈ మొత్తం ప్రక్రియకు 90 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ. 14వేల 222కోట్లుగా ఉంటున్నట్లు అంచనా.ఈ మొత్తంలో 13వేల 22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చా లని కోరాయి. మిగిలిన 1200కోట్ల లోటును పూడ్చేందుకు ఛార్జీల ప్రతిపాదనలను ఇస్తున్నట్లు డిస్కంలు వెల్లడించాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular