కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ లోని ఓ స్థానిక ప్రయివేట్ ఫంక్షన్ హాలునందు ఆదివారంనాడు కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమం లో భాగంగా బైక్ తో ర్యాలీ గా వచ్చిన ఒక యువకుడి మోటార్ సైకిల్, అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్నరూరల్ పోలీసుస్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ పద్మజ (27) పాదాలపైకి దూసుకెళ్లిందని, ఆమెకు స్వల్ప గాయానికి గురైనందున చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక రెన్నె ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న మహిళా కానిస్టేబుల్ ను కరీంనగర్ పోలీసు కమీషనర్ ఆదివారంనాడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వల్పగాయమైందని త్వరగానే కోలుకుంటుందని వైద్యులు చెప్పడంతో బాధితురాలికి , వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అన్ని రకాలుగా తోడుంటామని హామీ ఇచ్చారు.
పోలీస్ కమీషనర్ వెంట రూరల్ ఏసీపీ శుభమ్ ప్రకాష్ , ఇన్స్పెక్టర్లు కరీంనగర్ వన్ టౌన్ బిల్లా కోటేశ్వర్ , కరీంనగర్ రూరల్ ప్రదీప్ కుమార్ లు వున్నారు.