Friday, February 7, 2025

లక్షలు డిమాండ్ చేస్తున్న కౌన్సిలర్లు..!.. సదాశివపేట్ కౌన్సిలర్ల ఆడియో లీక్..

ప్రజాస్వామ్యం మాయని మచ్చగా తయారైయిన పేట కౌన్సిలర్లు

ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే మద్దతంటున్న వైనం

పదవిని కాపాడుకునేందుకు చైర్మన్ ల ఆరాటం

సీటు కోసం కోట్లు ఖర్చు చేసేందుకు సైతం సిద్ధమంటున్న నేతలు

సంగారెడ్డి, నిఘా న్యూస్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుమున్సిపాలిటీ లల్లో బి అర్ ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేస్తున్నారు. దీంతో పాలక కౌన్సిలర్లకు భలే నచ్చింది గిరాకీ పెరిగింది. ప్రజలు కల్పించిన అధికారం అంగట్లో సరుకు చేస్తున్నారు.స్వంత పార్టీల సిద్ధాంతాలను పక్కన బెట్టి అబ్బినo త దోచుకొనుటకు సిద్దం అవుతున్నారు.ఏ పార్టీ నాయకులైన సరే అంటూ సై అట్టు న్నారు.ప్రజల సేవ దేవుడికే ఎరుక మాకు మాత్రం డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే తమ ఓటు వేస్తామంటూ నిర్మో మాటంగా చెబుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి బస్తీలో సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి.కానీ కౌన్సిలర్ల బేరసారాలు మనడటం లేదు.ఉమ్మడి జిల్లాలో నర్సాపూర్ నారాయణఖేడ్ మున్సిపాలిటీ ల ల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ రెండిటినీ కాంగ్రెస్ కైవసం చేసుకోంది.

తాజాగా సదాశివపేట మున్సిపాలిటీ లో అవిశ్వాసం పెట్టిన కౌన్సిల్ సభ్యులు గోవ టూర్ వెళ్ళారు. ఈ నెల 9 తేదీన బలనిరుపనకు రానున్నారు.పేటలో స్వంత పార్టీ ఛైర్మెన్ పై అవిశ్వాసం పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడంతో అదనంగా ఒక ఓటు వచ్చే అవకాశం ఉంది. కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 9న బలనిరుపన ఓటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. దానికి తోడు చైర్మన్ ఆశిస్తున్న కౌన్సిలర్లు ప్రస్తుత చైర్మన్ పిల్లోడి జయమ్మ పై వ్యతిరేకత ఉన్న వారంతా కాంగ్రెస్ పార్టీతో కలిసి గోవా టూర్ కి వెళ్లారు. వీరు నేరుగా అసమతి తీర్మానం బల నిరూపణ సమయానికి సమావేశ మందిరంలోకి తీసుకువచ్చేలా సదరు కౌన్సిలర్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ వ్యవహారం పై మీడియా కథనాలు ప్రచురించింది.అంతా మీడియాలో రావడంతో జీర్ణించుకోలేని కౌన్సిలర్లు వార్తలు రాసిన జర్నలిస్టులపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు. కౌన్సిలర్ల బేరసారాలు ఆడియో వరైల్ కావడం తో కంగు తిన్నారు.

పైసా ల కోసం అవిశ్వాసం పెట్టారని లోకం కోడైయి కూస్తోంది.సదాశివపేట మున్సిపల్ పరిధి వీరేశం మహేశ్వరీ కౌన్సిలర్ భ గతంలో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నోటీసుఅందజేశారు. అందుకు ఒక్కొక్క కౌన్సిలర్ కు 50 నుంచి లక్ష రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఇంతలోనే శాసనసభ ఎన్నికలు రావడంతో అవిశ్వాస తీర్మానం అంశం కాస్త జాప్యం జరిగింది. మరో కౌన్సిలర్ అపర్ణ పాటిల్ భర్త శివరాజ్ పాటిల్ తాను చైర్మన్ కు నిలబడుతున్నానని కౌన్సిలర్లు ఎంత కావాలంటే అంత ఇస్తానంటూ తెలిపారు . ఒక్కో కౌన్సిలర్ కు 3 లక్షలు ఇస్తాను అందరు మెజార్టీ సభ్యులు తనకే మద్దతు పలుకాలని షరతు పెట్టారు.ఎవరైతే నేమి మాకు డబ్బులు కావాలి అట్టు అపర్ణ శివరాజ్ సై అన్నారు.

గోవా టూర్ మద్దతు దారులతో 4 తేదీన ప్రయాణం ఆయ్యారు. గోవ నుంచే అపర్ణ పాటిల్ భర్త చెక్రం తిప్పు తున్నారు.కౌన్సి లర్లకు డబ్బులు ఎరా వేశారు. దీంతో విహారయాత్రలో ఉన్న కౌన్సిలర్లు ఒకరు తమకు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే తమ ఓటు వేస్తామంటూ డిమాండ్ చేస్తున్న ఆడియో బయటపడింది. ఒక్కో కౌన్సిలర్ కు రెండు నుంచి మూడు లక్షలు ముట్ట చెప్పరాని సమచారం.పిల్లోడి జయమ్మ కొడుకు కూడా కౌన్సిలర్.. అమ్మను పదవిలో నుంచి దింపేందుకు తనకు ఇబ్బంది లేదు మీరు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వలేనని తెగేసి చెప్పటం విశేషం.ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చెప్పిన దాని ప్రకారం డబ్బులు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాం కదా.. అన్ని వార్డుల్లో కూడా సమానoగా అభివృద్ధి నిధులు వెచ్చించం కదా అన్నారు.ఇంకా పనులు ఇవ్వమంటే ఇస్తానని చెప్పాను.

అయినా అవిశ్వాస తీర్మానం నోటీసు పెట్టడం మంచిది కాదంటూ కౌన్సిలర్లకు చైర్మన్ కొడుకు పిల్లోడి విశ్వనాథం చెప్పడంతో అదంతా తమకు తెలియ దని, నాకు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే ఓటు అంటూ తేల్చి చెప్పిన ఆడియో లీక్ అయింది. పట్టణ ప్రజలు కౌన్సిలర్ల తీరు పై ఆగ్రహం తో ఉన్నా మాకు డబ్బులే ముఖ్యo అట్టు తెగేసి చెప్పటం మరో అంశంగా మిగిలింది.ఇదిలా ఉండగా ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందా లేదా అనేది అధికారులే తేల్చాల్సి ఉంది. మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఒక వ్యక్తి చైర్మన్ అయ్యేందుకు క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తున్నట్లు విశ్వాసనీయంగా తెలిసింది. మరి క్యాంపు రాజకీ యాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular