Saturday, August 2, 2025

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నిఘాన్యూస్: హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. కరీంనగర్ లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని కోరారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలు అత్యధికంగా విజయం సాధించేలా చేపట్టిన స్ట్రాటజీ, అదేవిధంగా కరీంనగర్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన పకడ్బందీ ప్రణాళికపై ముఖ్యమంత్రి తో రాజేందర్ రావు మాట్లాడారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ పార్టీ జెండా తప్పకుండా ఎగురవేస్తుందని రాజేందర్ రావు ముఖ్యమంత్రి కి వివరించారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాజేందర్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం శాయాశక్తుల కృషి చేస్తున్నామని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ఇప్పటినుంచే ప్రత్యేక దృష్టి సారించామని రాజేందర్ ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా కష్టపడి పని చేస్తున్నామని, నాయకులను అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి నుంచే కాంగ్రెస్ నాయకులు, పార్టీ యంత్రాంగం, పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డులు మంజూరు.. పెద్ద ఎత్తున రేషన్ కార్డుల్లో లబ్ధిదారుల పేర్ల నమోదు.. సన్న బియ్యం పంపిణీ, స్వశక్తి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేత, రైతులకు రైతుబంధు సాయం చేయడం వల్ల రైతులు, ప్రజలు, పేదలు సంతోషంగా ఉన్నారని రాజేందర్ రావు వివరించారు. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని దేవుడు లాగా కొలుస్తున్నారని, ప్రజా ప్రభుత్వం సకల జనుల హితమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నదని ఆనందం వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రితో పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించేలా కష్టపడి పని చేస్తామని రాజేంద్ర రావు ముఖ్యమంత్రి కి తెలిపారు. రాజేందర్ రావు చెప్పిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేసి అభినందించారు. అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా కష్టపడి పని చేయాలని రాజేందర్రావుకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వాడవాడనా, గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలనీ, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరికీ మరింత అవగాహన కల్పించాలని సూచించారని రాజేందర్ రావు తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular