రెండు సార్లు మార్చి ఇచ్చినా చెల్లని చెక్కు
చొప్పదండి, నిఘా న్యూస్ : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకపల్లికి చెందిన పిట్టల లలిత రెండేళ్ల క్రితం కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకొని సీఎంఆర్ఎఫ్ పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంది.
గతేడాది చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా రూ.12 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందుకుంది.
బ్యాంకులో డిపాజిట్ చేయగా ఈ పేరు మీద ఇంతకముందే వేరే వాళ్ళు నగదు తీసుకున్నారని చెప్పడంతో తిరిగి ఆ చెక్కును హైదారాబాద్ కు పంపించారుఅయితే అధికారులు మళ్ళీ తిరిగి అదే చెక్కును పంపించడంతో బ్యాంకు సిబ్బందికి చూపించిన లబ్దిదారు భర్త.. అయితే చెక్కు నెంబర్ మారలేదని నెంబర్ మారితేనే డబ్బులు వస్తాయని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో నిరాశగా వెనుదిరిగాడు
ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు వెంటనే సీఎంఆర్ఎఫ్ పరిహారం ఇప్పించాలని కోరుతున్న బాధిత దంపతులు