బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో…
రామడుగు, నిఘా న్యూస్: రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోయిందని భారతీయ జనతా పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ పెరక శ్రవణ్ ఆరోపణలు చేశారు. సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం లోని గంగాధర మండలం కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి కురిక్యాల వరద కాలువ బ్రిడ్జిపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకో సందర్భంగా ప్రధాన రహదారి ఇరువైపులా వాహనాలు ఎక్కడికి ఎక్కడ స్తంభించిపోయాయి. అనంతరం విలేకరుల ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తానని తీరా వరి పంట కోత దశకు వచ్చేసరికి నీళ్లు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ మేడిపల్లి సత్యం చెప్పానని నియోజకవర్గంలో మాయమాటలతో గెలిచి పబ్బం గాడుకుంటున్నారని కనీసం రైతులను ఆదుకోవడంలో చొరవ చూపడం లేదంటూ విమర్శించారు.

ఎస్సారెస్పీ నుండి నీటిని విడుదల చేస్తే కనీసం ఈ వేసవి కాలంలో పంటలు బయటపడతాయని లేదంటే పూర్తిగా ఎండిపోతున్నాయని దీనిపై ప్రభుత్వం వెంటనే పట్టించుకోని రైతులకు సరిపడా నీళ్లు వరద కళాధార విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద మొత్తంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముద్రయించే పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని నీటిని విడుదల చేసి చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. నియోజకవర్గ స్థాయి నాయకులు కోలా అశోక్ కళ్యాణ్ శేఖర్ శ్రీనివాస్ రామ్ లక్ష్మణ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు