Sunday, March 22, 2026

సమయానికి రాని బస్సులతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు!

భూపాలపల్లి, నిఘా న్యూస్: ఆర్టీసీ బస్సులు సమయ పాలన పాటించకపోవడం తో విద్యార్థులు, ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయ పాలన పాటించడంలో సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులు విఫలమవు తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళలో భూపాలపల్లి నుండి గోదావరిఖని వెళ్లాలంటే బస్సు వస్తుందో? రాదో?అర్థం కాని పరిస్థితి ఏర్పడింది, వస్తే ఒకేసారి రెండు మూడు బస్సులు వస్తాయని రాకపోతే బస్సుల కోసం గంటలకొద్దీ నిరీక్షణ తప్పడం లేదని వారు వాపోయారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో మహిళా ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగింది. కనీసం నిల్చోడానికీ బస్సుల్లో స్థలం ఉండటం లేదు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచడంలో భూపాలపల్లి,గోదావరిఖని,మంథని,డిపో అధికారులు విఫలమయ్యారు.భూపాలపల్లి నుండి గోదావరిఖనికి 5 డిపోలకు చెందిన బస్సులు తిరుగు తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ప్రభుత్వ ఉద్యోగు ల తో పాటు సామాన్య ప్రయాణికులు తమ తమ అవసరాల నిమిత్తం భూపాలపల్లి,హనుమకొండ,వరంగల్,కాళేశ్వరం,ఈ రూటులో నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగాల్సింది పోయి అంతకుముందు కంటే బస్సులు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. భూపాలపల్లి, రూట్లో ప్రైవేట్ అద్దె బస్సులు బస్సులు ఎక్కువగా తిరుగుతాయి, అగ్రిమెంట్ ఐపోయిన అద్దె బస్సుల స్థానంలో సంస్థ బస్సు నడపాల్సింది పోయి మాకేం సంభంధం లేదన్నట్టు వ్యవహరించడం వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడాల్సివస్తుంది దానికితోడు పొద్దంతా ఒకదాని వెంట మరోటి నడుస్తున్న చీకటి పడగానే ఒక్క బస్సు కూడా కనబడ డం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular