Wednesday, March 4, 2026

జర్నలిస్టులపై సీఎం తీరు సరికాదు

కరీంనగర్, నిఘా న్యూస్: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడిన తీరు సరికాదని జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులను అందరినీ ఒకే రకంగా చూడడం సరికాదని, అసభ్యంగా మాట్లాడిన, అసత్య వార్తలు రాసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటే తప్పు లేదని, సంఘాల పేరుతో అక్రిడేషన్ కార్డులు తీసుకుంటున్నారని అనడం జర్నలిస్టులందరినీ అవమానించడమేనని ఆవేదన వెలిబుచ్చారు. ఒకవేళ అలాంటి వారు ఉంటే గుర్తించి వారి గుర్తింపు కార్డులు తొలగించాలని సూచించారు. తాంబూలాలు అడుగుతున్నారని సీఎం అనడం సబబు కాదని, ఎక్కడో కొందరు అలా చేస్తే అందరూ జర్నలిస్టులను ఒకే గూటిపైకి తీసుకువచ్చేలా సీఎం చేసిన వ్యాఖ్యలు జర్నలిస్టుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular