విజయం సాధించి అభివృద్ధిని చూపిస్తా
అనకాపల్లి, ఏప్రిల్ 20, నిఘా న్యూస్: రానున్న ఎన్నికలలో ప్రజాభిమానంతో విజయం సాధించడం ద్వారా అభివృద్ధి అంటే ఏమితో ప్రజలకు చేసి చూపిస్తానని అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు.శుక్రవారం చోడవరంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన,వారి అభిమానం చూసి చలించిపోయారు.ఈ ప్రాంత ప్రజలనుంచి ఇంతటి ఆదరణ ను మర్చిపోలేనని అంటూ.. ఇదే అభిమానాన్ని ఎన్నికలలో చూపించి,తనతో బాటు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ,టీడీపీ,జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
చోడవరంలో సీఎం రమేష్ ఇంటింటి ప్రచారం.
RELATED ARTICLES