CM Jagan: విశాఖపట్నం, నిఘా న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శారదా పీఠాన్ని సందర్శిస్తారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం కలెక్టర్ మల్లికార్జున, జాయింట్ సీపీ ఫకీరప్ప ఏర్పాట్లపై పీఠం ప్రతినిధులతో సమీక్షించారు. ఎయిర్ పోర్టు నుంచి శారదాపీఠం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం హోదాలో నాలుగోసారి శారదా పీఠానికి వస్తుండడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు పీఠం ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి బయలుదేరి సీఎం జగన్ గన్నవరం ఎయిర్ పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 11 .20 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీ శారద పీఠానికి 11:40 గంటలకు చేరుకుంటారు.
నేడు విశాఖకు సీఎం జగన్..
RELATED ARTICLES