అమరావతి, నిఘా న్యూస్:ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలకు రానున్నారు. తిరుమలకు చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిం చనున్నారు. సాయంత్రం 7గంటలకు తిరుమలకు చంద్రబాబు చేరుకోను న్నారు.రాత్రి 8గంటలకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి శ్రీవారికీ పట్టవస్త్రా లను చంద్రబాబు సమర్పించనున్నారు. దర్శనాంతరం 2025 డైరీ, క్యాలెండర్లను చంద్రబాబు ఆవిష్కరించునున్నారు.
రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీవారిని ఊరేగిస్తారు. ఈ ఉత్సవా ల్లో చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు తిరుమల వస్తుండటంతో పోలీసులు భారీ భధ్రత ఏర్పాట్ల చేపట్టారు.భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరు మల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న అంకురార్పణ కార్యక్రమం జరిగింది.స్వామి సర్వసేనాధిపతైన విష్వక్సేనుడు ఊరేగింపుగా మాడవీధిలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత యాగశాలలో శాస్త్రోక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు.