కరీంనగర్ జూలై 14 (నిఘా న్యూస్):- కరీంనగర్ లోని వీ కన్వెన్షన్ లో జరిగినటువంటి ఇంపాక్ట్ ట్రైనింగ్ వర్క్ షాప్ వ్యక్తిత్వ వికాస నిపుణులు లో ప్రతిభ కనపర్చినటువంటి కొత్త ట్రైనర్స్ కు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమం లో ఉత్తమ ప్రతిభ ను కనపర్చడమే కాకుండా ఇంపాక్ట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల నిర్వహణలో చురుకుగా పాల్గొనే జక్కని లోకేందర్ కి సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా లోకేందర్ మాట్లాడుతూ ఇంటికొక స్పీకర్ ఊరికోక ట్రైనర్ నినాదంతో గంపా నాగేశ్వర్ రావు ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపించి ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఎంతోమంది స్పీకర్ లను ట్రైనర్ లను తయారు చేశారు. అలాంటి వ్యక్తికి శిష్యుడి గా చేరి నేటి తో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న నేను 2024 నూతన విద్యాసంవత్సరం మొదలు అవ్వగానే ప్రతి వారం లో ఒకటి లేదా రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రభుత్వ కళాశాల ల్లో విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా వ్యక్తిత్వ వికాస కార్యక్రమలు నిర్వహిస్తు నేటీ యువతను అసలు సిసలైన భావి భారత పౌరులు గా తీర్చిదిద్దాడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ గంపా నాగేశ్వర్ రావు కి ఆశయసాధనకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నాకు ఇంత గొప్ప విద్యను అందించి ప్రతిక్షణం సపోర్ట్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా గురువులు వెంకట్ అప్పన్న , వేణుగోపాల్, పిన్నం రవి, సయ్యం సాయిబాబు, జాహ్నవి, గొట్టిముక్కల రవీందర్, జెట్టి సతీష్, కందగట్ల పరిసరం తదితర గురువులందరికి ఎప్పటికి రుణపడి ఉంటానని మాట్లాడారు.జాయిన్ అయినప్పటి నుండి ఇంపాక్ట్ లో జరిగే ప్రతి కార్యక్రమం లో చురుకుగా పాల్గొంటు తనకి ఇస్తున్న భాద్యత ను నిశ్వరతంగా చేసే ఇలాంటి శిష్యుడు మాకు దొరుకడం ఆనందంగా ఉందని చెప్పారు.