సిరిసిల్ల, నిఘా న్యూస్ :రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల, విద్యార్థినుల, ప్రయాణికుల రక్షణ, భద్రతయే లక్ష్యంగా వేములవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్ లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 120 బస్సుల లో కెమెరాలు ప్రారంభించినట్టు తెలిపారు. అతి త్వరలోనే వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డిఎస్పి నాగేంద్ర చారి, సిఐ కరుణాకర్, డిపో మేనేజర్ తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు
RELATED ARTICLES