తిమ్మాపూర్ (నిఘా న్యూస్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామంలో ఆదివారం రాత్రి పలువురు రైతుల ఇండ్ల వద్ద కట్టేసిన పశువులు (5 ఆవులు,1 దూడ) లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వెంటనే అప్రమత్తమైన పశువుల యజమానులు బాధితులు స్థానిక ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం గో-రక్ష విభాగ్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులుఘటనా స్థలాలను పరిశీలించి బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోరక్ష విభాగ్ ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ…ఇంటి వద్ద ఉన్న పశువులను అపహరించడం చాలా దారుణం, దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, పశువులను దొంగలించిన ముష్కరులను పట్టుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువులు అత్యంత భక్తి భావంతో పూజించే ఆవులను అపహరించడం, కబేలాలకు తరలించడం వంటి ఘటనలు జరగడం, హిందూ మత విశ్వా సాలను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. ఇవే కాకుండా రోజూ వందల సంఖ్యలో గోమాతలను కబేలాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ, పోలీస్ యంత్రాంగo అప్రమత్తమై గోమాతలను కబేలాలకు తరలించకుండా చర్యలు చేపట్టాలని, గోవులను రక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గో-రక్ష విభాగ్ ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, విశ్వహిందూ పరిషద్ జిల్లా కార్యదర్శి ఆది మూల విద్యాసాగర్, సహా కార్యదర్శి జగదీశ్, నాయకులు తోట రాజేందర్, శ్రీనివాస సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు స్వరూప, జిల్లా కోశాధికారి ఆం జనేయులు,బిజెపి నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, పెండ్యాల కిషన్ రెడ్డి, తిరునగరి వెంకటాద్రి స్వామి, ఎడ్ల లక్ష్మారెడ్డి తో పాటు బాధితులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
మహాత్మనగర్ లో పశువుల అపహరణ…
RELATED ARTICLES