కరీంనగర్, నిఘా న్యూస్ : కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఎఆర్ నమోదైంది. వెలిచాల తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బండి సంజయ్ అనని మాటలను అన్నట్లుగా డీప్ ఫేక్ వీడియోలు, కాల్ రికార్డింగ్ సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత కొట్టె మురళీకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన వెలిచాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై కేసు నమోదు
RELATED ARTICLES