కరీంనగర్, నిఘా న్యూస్: రాజన్న సిరిసిల్ల జర్నలిస్టు కాయిత బాలు పై తహసిల్దార్ తీసుకున్న చర్యలను ఖండిస్తున్నట్లు జర్నలిస్టు సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ అలియాస్ నిఘా శీను ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల జర్నలిస్టు పై భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్163 విధించి నెలరోజులపాటు ఎలాంటి ప్రకటన చేయరాదంటూ, వ్రాతపూర్వకమైన, వీడియో సందేశం గానీ ప్రచారం చేయరాదు అంటూ సిరిసిల్ల తహసిల్దార్ నిషేధం విధించడం నిరంకుశ చర్య గా భావిస్తున్నట్లు తెలిపారు. ఇది ఒక జర్నలిస్టు భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయడమే తప్ప మరెమీ కాదని, ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా పౌరులకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుందని అన్నారు. ఒక జర్నలిస్టు కానీ సాధారణ పౌరుడు గాని ఏదైనా ఒక అంశాన్ని సోషల్ మీడియా ద్వారా గాని, దృశ్య శ్రవణ ప్రింట్ మీడియాల ద్వారా గాని ప్రజల ముందు ఉంచినప్పుడు అందులో తప్పు ఉంటే చట్ట ప్రకారం సవాలు చేసే అవకాశం, ఖండించే అవకాశం ఉందని, కానీ దానిని ఆసరాగా తీసుకొని ఏకంగా 163 సెక్షన్ విధించడం అధికారాన్ని దుర్వినియోగ పరచడమే అవుతుందనిచ చెప్పారు. సోషల్ మీడియాలో వ్యక్తులు వ్యక్తం చేసే అభిప్రాయాలపై ఏ విధంగా వ్యవహరించాలో ఇప్పటికే పలుమార్లు కోర్టులు వెల్లడించాయని అన్నారు. వాటన్నింటినీ పరిశీలించి పరిగణలోకి తీసుకొని ఒక జర్నలిస్టు భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూ బాలు పై విధించిన 163 సెక్షన్ ను తాసిల్దార్ వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
సిరిసిల్ల జర్నలిస్టుపై కేసు ఖండనీయం
RELATED ARTICLES