Wednesday, March 4, 2026

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీ కాదా?: మేయర్ గద్వాల విజయలక్ష్మి

హైదరాబాద్, నిఘా న్యూస్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసి, కౌన్సిల్ సమావేశం ఈరోజు గందరగోళంగా మారింది.ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి రాజీనామా చేయా లంటూ బిఆర్ఎస్ కార్పొ రేటర్లు నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని, మేయర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.ఈ నేపథ్యంలో, సమావేశం లో గందరగోళ పరిస్థితి నెలకొంది. బిఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీ కదా?అని మేయర్ మండిపడ్డారు. ఈ అంశంపై నిరసన తెలిపేందుకు బిఆర్ఎస్ కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు.ఆందోళనలు ఆపకపోతే… సమావేశాన్ని నిరవధికంగా వాయిదావేస్తానని హెచ్చరిం చారు. అయినప్పటికీ పరి స్థితి అదుపులోకి రాకపో వడంతో… సమావేశాన్ని ఆమె 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.మరోవైపు విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కూడా బిఆర్ ఎస్ తరపునే గెలుపొందా రు. ఇటీవలే వారూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో, వీరిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బిఆర్ఎస్ సిద్ధమయింది. ఈ క్రమంలోనే వీరి రాజీనా మాకు బిఆర్ఎస్ కార్పొరేట ర్లు పట్టుబడుతున్నారు..

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular