కరీంనగర్, నిఘా న్యూస్: నగరంలోని 37వ డివిజన్లోని మీకోసం కార్యాలయంలో నేడు నగర బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండు రోజుల క్రితం కేటీఆర్ ర్యాలికి యువత నుంచి వచ్చిన స్పందన చూసి బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు నిద్ర పట్టడం లేదన్నారు. కేటీఆర్ ను విమర్శించే స్థాయి సునీల్ రావుకు లేదన్నారు. కేటీఆర్ కాలి గోటికి కూడా సునీల్ రావు సరిపోడనీ విమర్శించారు.
సునీల్ రావుకు మేయర్ హొదా ఇచ్చిందే బి.అర్.ఎస్.పార్టీ అని గుర్తు చేశారు. అధికారం కోసం పార్టీ నాయకులను జోకే చరిత్ర సునీల్ రావుదని విమర్శించారు. దొడ్డిదారిన పదవి పొంది కోట్లు సంపాదించాడన్నారు. కరీంనగర్ రాజకీయాల్లో ఊసర వెళ్ళిగా సునీల్ రావుకు పేరుందని విమర్శించారు. ఊసర వెల్లి సునీల్ రావు పట్ల బండి సంజయ్ జాగ్రత్త గా ఉండాలని కేంద్ర మంత్రి కి సూచించారు. అత్యంత అవినీతి పరుడు ఎవరని గూగుల్ లో వెతికితే సునీల్ రావు పేరు వస్తుందని విమర్శించారు. బిఆర్ఎస్ నేతలను విమర్శిస్తే సునీల్ రావు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. స్మార్ట్ సిటీ లో బండి సంజయ్ పాత్ర లేదని బి.అర్.ఎస్ లో ఉన్నప్పుడు విమర్శించిన విషయం సునీల్ రావు మరిచి పోయావా అని ఎద్దేవా చేశారు.
కరీంనగర్ అభివృద్ధి మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోనే సాధ్యమైందని గుర్తు చేశారు. ఇటు కేంద్ర మంత్రి సంజయ్ పై మరియు రాష్ట్ర మంత్రి పొన్నం పై చల్ల హరి శంకర్ విరుచుకపడ్డారు. బి.అర్.ఎస్ ప్రభుత్వ హయంలోనే కరీంనగర్ అన్నివిధాల అభివృద్ధి చెందిన విషయం మంత్రి పొన్నం ప్రభాకర్ గమనించాలన్నారు. 15 నెలల కాలంలో మంత్రిగా పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేసారు. తమ హయంలో జరిగిన అభివృద్దే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అభివృద్ధి జరగలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయన్నారు. ఇటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని మరచి..ఒక కార్పొరేటర్ లాగా మాట్లాడటం సిగ్గు చెటన్నారు.
కెసిఆర్ కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది అన్న విషయం బండి సంజయ్ కు ఎలా తెలిసింది… అందులో పని చేశారా అని ఎద్దేవా చేసారు.రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందేదుకే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. బండి సంజయ్ కు దమ్ముంటే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మీద మాట్లాడాలని హితవు పలికారు. కెసిఆర్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ కలిసి డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారని వారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో చల్ల హరి శంకర్ తో పాటు బిఆర్ ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, నగర యూత్ ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయి కృష్ణ, నగర మైనార్టీ అధ్యక్షులు షౌకత్, విద్యార్థి విభాగం అధ్యక్షులు బొంకూరి మోహన్,కరీంనగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, కరీంనగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యూత్ మైనార్టీ అధ్యక్షులు నవాజ్, పార్టీ డివిజన్ అధ్యక్షులు నేతి చంద్రశేఖర్, ఆరె రవి గౌడ్, జెల్లోజి శ్రీనివాస్, కొత్త అనిల్ కుమార్, రాజేందర్, దుడెల్ల ప్రశాంత్,కర్రే అనిల్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నారదాసు వసంతరావు, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి గారు మెరుగు శ్రీనివాస్ గౌడ్, ఉమా శంకర్, ఒడ్నాల రాజు, సతినేని శ్రీనివాస్, గూడెల్లి రాజ్ కుమార్, మంచి కట్ల కిషోర్, నరసింగరావు, మైనార్టీ నాయకులు నయీమ్ గారు మహిళా నాయకురాలు గంటల రేణుక గారు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.