కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన బండి సంజయ్
సంజయ్ ను కలిసి సివిల్స్ విజేత మెరుగు కౌశిక్
కౌశిక్ ను అభినందించిన బండి సంజయ్
కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 44వ డివిజన్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. అంబేద్కర్ క్లబ్ అధ్యక్షులు కొంపల్లి రమణ్ కుమార్ ఆధ్వర్యంలో పావులా అనిల్ కుమార్, పిట్టల హరీష్ కిరణ్, కొరివి కరుణాకర్, జి.చరణ్, క్రర నవీన్ కుమార్, బి.శంకర్, సాయి ధనుష్, రుత్విక్, మేకల సిద్ధార్థ, పిట్టల ఆశీష్, బి.జైలుదాస్ తదితరులు ఈరోజు ఎంపీ కార్యాలయానికి విచ్చేసి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వనించిన బండి సంజయ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు క్రుషి చేయాలని కోరారు. మోదీ హయాంలోనే దేశ అభ్యున్నతి సాధ్యమన్నారు.మరోవైపు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో 82వ ర్యాంకు సాధించిన సివిల్స్ విజేత మెరుగు కౌశిక్ ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జనగాం జిల్లాకు చెందిన కౌశిక్ ను బండి సంజయ్ అభినందించారు. పట్టుదల, అంకిత భావంతో పరీక్షలు రాసి అత్యున్నత ఉద్యోగానికి ఎంపికవడం మామూలు విషయం కాదన్నారు. సివిల్స్ ఉద్యోగంలో చేరిన తరువాత సమాజంలో అట్టడుగునున్న పేదలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చేలా క్రుషి చేయాలని కోరారు.