హైదరాబాద్, నిఘా న్యూస్: రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. గురువారం అర్ధరాత్రి ఓ ఆర్ పై ఆమె ప్రయాణిస్తుండగా స్కార్పియో కారు అదుపు తప్పింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు. గత ఏడాది లాస్య నందిత తండ్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఆయన కూతురు లాస్య నందితకు టికెట్ ఇవ్వడంతో గెలుపొందారు. అయితే ఇప్పుడు ఆమె మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే లాస్య నందిస్తున్న కారు ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందన్న చర్చ సాగుతోంది.
Breaking News :రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి
RELATED ARTICLES