వేములవాడ జనవరి 11 (నిఘా న్యూస్): వేములవాడ పట్టణంలో చలి తీవ్రతకు తట్టుకోలేక దేవాలయం సమీపంలో వున్న యాచకులకు, నిరాశ్రయులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమం కు ఫౌండేషన్ అధ్యక్షుడు గొడిశెల తిరుపతి హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ యువ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పోలీస్, ఆర్మీ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు మరియు ఉద్యోగం లో చేరిన యువతీ యువకులు ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొని సమాజ సేవ చేయటం అభినందనీయం యువకులను అభినందించారు.అనంతరం యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ చలి తీవ్రత అధికం గా వుంది అని అన్ని సౌకర్యాలు వున్న మనమే చలి కి తట్టుకోలేక పోతున్నాం రాత్రి వేళలో పట్టణం లో తిరుగుతూ ఎవరికైతే దుప్పటి లేదో వారిని గుర్తించి దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది అని,రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి మీ మీ ఏరియాలలో ఎవరైనా అభాగ్యులు ఉంటే వారికి కప్పుకోడానికి దుప్పట్లు లేనట్టు అయితే దుప్పట్లు దానం చేసి మానవత్వం చాటుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మధు మహేష్,యువ ఫౌండేషన్ ఉద్యోగులు రాజు, అరవింద్, అభ్యర్థులు మనోజ్, వినయ్,రామ్ కుమార్,మోహన్,రాహుల్,హేమంత్, రాకేష్, ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, చిన్నారులు సింధూజ,సిరి చందన,చరణ్ తదితరులు పాల్గొన్నారు.
యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ
RELATED ARTICLES


