Monday, August 4, 2025

నల్లమట్టి చోరీ

మట్టి తరలించేందుకు వచ్చిన లారీలు

(నిఘాన్యూస్) రామడుగు : ప్రత్యేక అధికారి పాలన పక్కదారి పడుతోంది. సర్పంచుల పదవీకాలం ముగియ డంతో గ్రామాల పర్యవేక్షణ కోసం బాధ్యతలు చేపట్టిన అధికారులు వ్యక్తిగత లాభం కోసం ఆరాటపడుతున్నారు. అక్రమాలకు తెరలేపుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. రైతులకు వ్యవసాయ అవసరాలకు విక్రయించాల్సిన చెరువు మట్టిని అక్రమార్కులు దోచుకునేందుకు అవకాశం కలిపిస్తున్నారు. ఇటుకబట్టీల యాజ మాన్యాలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటు న్నారు. దీంతో ప్రత్యేక అధికారుల పనితీరుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ మట్టి అక్రమ దందాను అడ్డుకుంటున్నారు.

రామడుగు మండలంలోని వన్నారం గ్రామంలోని పెద్దచెరువులో నల్లమట్టి అక్రమ రవాణాను గ్రామస్తులు అడ్డు కున్నారు. రామడుగు మండలంలో ఎక్కడ చెరువులు కనబడిన ఇటుక బట్టీల యజమానుల మాఫియా ఒక వింగ్ ఏర్పడి అనుమతుల పేరుతో ఇష్టానుసారంగా లారీలు, టిప్పర్లతో అక్రమంగా మట్టిని తరలి స్తున్నారు. రూ.కోట్ల రూపాయలు

సొమ్ము చేసుకుంటున్నా ప్రత్యేక అధికార బృందం తమకేమీ పట్టనట్లు మీనా వేషాలు లెక్కి స్తున్నారు. గత మూడు రోజుల నుంచి అన్నారం పెద్ద చెరువులో పెద్ద జేసీబీలతో దాదాపు 100లారీలు ఒకేసారి నల్లమట్టి తరలించుకుపో వడం ఇంత తతంగం జరుగుతున్నా అధికార యంత్రంగా మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహ రిస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నారం గ్రామ ప్రత్యేక అధికారికి గ్రామంలోని పలువురు ఫోన్ ద్వారా చెరువులోని నల్ల మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు. అంతేకాకుండా గ్రామపంచాయతీ సెక్రెటరీ కూడా అదే తరహాలో వ్యవహరించ డంతో గ్రామంలోని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులోని నల్ల మట్టిని తర లించుకుపోవడంతో రానున్న వర్షాకాలంలో చెరువు నిండిన కొద్ది రోజులకే నీరు అడగంటి పోతుందని, అదే నల్లమట్టి ఉండడం వల్ల నీటి నిల్వ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోని చోటా మోటా నాయకులతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని మామూళ్లతో మంచిగా చేసుకుని రూ.లక్షలు గడిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అధికార యంత్రాంగం మాత్రం రూ. లక్షల సొమ్ము తీసుకుని అనుమతుల పేరుతో ఒక కాగితాన్ని అప్పజెప్పి రూ.కోట్ల సొమ్ము చేసుకునే విధంగా నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి తరలింపునకు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ నల్లమట్టి అక్రమ తరలింపును నిలిపివేయకపోతే జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ శాఖను ముట్టడిస్తామని గ్రామస్తులు హెచ్చరిం చారు. నల్లమట్టి తరలింపు కొనసాగుతుం దని తెలుసుకున్న ప్రజలు అన్నారం చెరు వులోకి వెళ్లి అడ్డుకున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇంత తతంగం జరుగుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క వాహనాన్ని కూడా సీజ్ చేసిన దాఖలాలు లేవని, అందుకు అధికారులు వత్తాస్ పలకడం నిదర్శనమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular