కాంగ్రెస్ తోనే పట్టభద్రుల సమస్యల పరిష్కారం
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
కామారెడ్డి,(నిఘా న్యూస్) కామారెడ్డిఈనెల 27న జరిగే కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టభద్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ పాల్గొని మాట్లాడారు..
ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మాట్లాడుతూ పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, కాంగ్రెస్ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డిని గెలిపిస్తేనే సమస్యలు పరిష్కా రమవుతాయని పేర్కొన్నారు. కరీంనగర్- మెదక్ – ఆదిలాబాద్- నిజా మాబాద్ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఆదరించి గెలిపిస్తే అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అంది స్తుందన్నారు. నరేందర్ రెడ్డి స్థానికుడని, పట్టభద్రులంతా ఈ విషయాన్ని గమ నించి అందుబాటు లో ఉన్న వారిని ఎన్నుకోవాలని కోరారు. స్థానికేతరులకు ఓటు వేసి వృథా చేసు కోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తూ వస్తుందని, విద్యావంతులంతా ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తుందన్నారు. ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నరేందర్ రెడ్డి ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.విద్యావేత్త నరేందర్ రెడ్డి కి ఉద్యోగ నిరుద్యోగ పట్టబద్రుల సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్లి పరిష్కరించే సత్తా ఆయనకే ఉందని అధికార కాంగ్రెస్ పార్టీతోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని అబద్దాలు,అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఓట్ల కోసం వస్తున్న నాయకుల మాటలు నమ్మవద్దని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు
అందుబాటులో ఉండి సేవ చేస్తా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి
పట్టభద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తమ విద్యాసంస్థలు ద్వారా ఎందరో పేద విద్యార్థులకు చదువులు అందించామని, రానున్న రోజుల్లో పేద విద్యార్థులకు రాయితీ కల్పిస్తానని హామీ ఇచ్చాడు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ఖండించా రు. దాదాపు 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. గిట్టని వాళ్ళు చేసే అసత్య ఆరోపణలు పట్టభద్రులు నమ్మవద్దని కోరారు…ఈకార్యక్ర మంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్, మంత్రి జూపల్లి కృష్ణారావు, జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతారావు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు మరియు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు