గన్నేరువరం, (నిఘా న్యూస్): మండల కేంద్రం గన్నేరువరంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరించి స్వీట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభమైన బిజెపి పార్టీ నేడు 303 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశం కోసం ధర్మం కోసం పాటుపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారంలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ నాయకులను ప్రజలు గెలిపించనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, జాలి శ్రీనివాస్ రెడ్డి, అధికం రామచంద్రం, బండి తిరుపతి అధిక సంఖ్యలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.
బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
RELATED ARTICLES