బిఆర్ఎస్ పార్టీని వీడిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల నాయకులు, కార్యకర్తలు
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
గంగాధర లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, నిఘా న్యూస్: పార్లమెంటు ఎన్నికలవేళ బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు 500 మంది బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.కొడిమ్యాల ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజా నర్సింగరావు, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, పూడూరు సింగిల్ విండో చైర్మన్ బండ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ముమ్మడి రామస్వామి ,ఎంపిటిసి సభ్యులు చీకట్ల సింధు మహేష్, సామల లక్ష్మణ్, సుజాత వినోద్, సుజాత శోభన్, మ్యాక మరియా రవీందర్, నసీరుద్దీన్, సర్పంచులు అంబటి లత తిరుమలేష్, సామంతుల ప్రభాకర్, ఉప సర్పంచ్ ఎల్లయ్య, పులి మనోహర్, మాజీ ఎంపిటిసి సభ్యులు బొడ్ల సతీష్, దొంతరవేణి పుష్ప దేవయ్య, సమిరిశెట్టి విమల సురేష్, వికృతి నాగరాజ్, నేరెళ్ల మహేష్, సింగిల్ విండో డైరెక్టర్స్ దుబ్బాక రాధ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
![](https://kalamnigha.com/wp-content/uploads/2024/04/choppddandi2-1024x768.jpg)
గంగాధర లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వీరికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు విలువ లేదని పేర్కొన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తూ, పార్టీ కోసం కష్టపడ్డ వారిని నిర్లక్ష్యం చేశారన్నారు.బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల ఒంటెద్దు పోకడతో విసిగిపోయినట్లు తెలిపారు.కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మకంతో ఆ పార్టీలో చేరినట్టు నాయకులు పేర్కొన్నారు.ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందడం ఖాయమన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.