వరంగల్, జనతా న్యూస్: జనగామ జిల్లా లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పాలకుర్తి మండలం ఎల్లారాయిని తొర్రూరు పిఎసిఎస్ బ్యాంక్ చైర్మన్ గోనే మైసిరెడ్డి,వైస్ చైర్మన్ బానోత్ రందన్, డైరెక్టర్లు పులి ప్రభాకర్ గౌడ్, దామెర అంజయ్య, మూసుకు కేశవులు,నేడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, బొబ్బల రమణారెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించి ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ” పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ పసులది వెంకటేష్,ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ముఖ్య నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.
ఎర్రబెల్లి ఇలాకాలో బీఆర్ఎస్ కు భారీ షాక్
RELATED ARTICLES