కారు దిగి హస్తం గూటికి చేరిన కరీంనగర్ జిల్లా గంగాధర మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
గంగాధర మండలం మధురనగర్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మేడిపల్లి సత్యం
కరీంనగర్, నిఘా న్యూస్: పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమల్ రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ పడితేపల్లి కిషన్, చొప్పదండి మండల మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణాహరి,మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు, మాజీ వైస్ ఎంపీపీ కర్ర బాపురెడ్డి, చిన్న అచంపల్లి సర్పంచ్ దోర్నాల హన్మంతరెడ్డి ,తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు విలువ లేదని, పార్టీ కోసం పనిచేసిన వారిని నిర్లక్ష్యం చేసి, ప్యారాషూట్ నాయకులకే ప్రాధాన్యత ఇచ్చారని నాయకులు పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చకనే పార్టీకి రాజీనామా చేసినట్టు వారు తెలిపారు.కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు నాయకులు తెలిపారు.