హైదరాబాద్, నిఘా న్యూస్:సుప్రీం కోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా భూషణ్ రామ్ కృష్ణ గవాయ్ భాద్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఈ రోజు సుప్రీం కోలీజీయం ఆయన పేరును తదుపరి చీఫ్ జస్టిస్‌గా ప్రతిపాధించింది.కాగా ప్రస్తుతం సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానున్నారు. అనంతరం గవాయ్ తదుపరి చీఫ్ జస్టిస్‌గా భాద్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే జస్టిస్ భూషణ్ రామ్‌కృష్ణ గవాయ్ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.
ఆయన 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా నియమితులయ్యా రు.సీనియారిటీ ప్రకారం.. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13న రిటైర్ అయిన తర్వాత, జస్టిస్ గవాయ్ 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా బాధ్యతలు స్వీకరించను న్నారు. ఆయన ఆరు నెలల పాటు పదవులు కొనసాగుతారు.