ప్రచారంలో కాంగ్రెస్,బిఅర్ఎస్ హోరాహోరీ
బీజేపీ ప్రచారం అంతంత మాత్రమే..
కేవలం మోడీ గ్రాఫ్ పైనే ఆధారపడుతున్న బండి
పార్టీ సీనియర్లను విస్మరిస్తూ ఇతర పార్టీ నేతల వైపు చూస్తున్న బండి..
కరీంనగర్, నిఘా న్యూస్: పార్లమెంటు ఎన్నికల ప్రచారం దేశ వ్యప్తంగా జోరుగా నడుస్తున్న నేపథ్యంలో
కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో బి అర్ ఎస్ కార్పొరేటర్లు చేరికతో కాంగ్రెస్ లో నూతన ఉత్సాహంతొ రాష్ట్ర నాయకులతో ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు మాజీ ఏం పి, బి అర్ ఎన్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, గతంలో చేసిన అభివృద్ధి పనులు, స్మార్ట్ సిటి, కేబుల్ బ్రిడ్జి ఇతర అభివృద్ధి పనులతో బి అర్ ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంటే, బి జె పి మాత్రం ప్రచారంలో వెనుకబడి ఉంది, బండి సంజయ్ గత ఐదు సంవత్సరాలుగా చేసిన పనులు ఏమి లేకపోవడం, యువతను, హిందుత్వాన్ని మాత్రమే నమ్ముకోవడం, అభివృద్ధి పై మాట్లాడకపోవడం , బి జె పి లో ఒక వర్గం సహకరించకపోవడం, ప్రచారంలో పసలేకపోవడంతో గెలుపు అవకాశాలు సన్నల్లుతునాయి, ఇకనైనా బి జె పి నాయకులు సరైన ప్రణాళికతో ప్రచారం చేస్తేగాని బండి సంజయ్ గెలిచే అవాశాలు లేవు..