లింగపూర్ లోని, ముదిరాజ్ పల్లి వాడ లో – దోమల నివారణపై అవగాహన.
మానకొండూర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో వెల్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో శుక్రవారం డ్రై డే ఫ్రైడే(Dryday-Friday) కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలంలో పెరుగుతున్న జ్వరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా PHC మెడికల్ ఆఫీసర్ డా. వెంకటేష్ గారు మాట్లాడుతూ “డెంగీ, మలేరియా నివారణకు ఇంటి చుట్టూ నిల్వ నీటిని తొలగించాలి. ముఖ్యంగా పాడయిపోయిన కూలర్లు, త్రాగి పాడేసిన కొబ్బరిబోండాలు,వాటర్ బాటిల్స్, పగిలిపోయిన కుండలు, పాత టైర్స్,రోళ్ల లో నీటి నిలువల వలన దోమలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అనవసర నీటి నిలువ లేకుండా చూసుకువాలి…దోమల నివారణకు కెమికల్స్ కాకుండా, ఇంటిలో దోమ తెరలు వాడాలి” అని సూచించారు.
ఇలా చేయటం వల్ల కుటుంబాలను ముప్పు నుంచి రక్షించుకోవచ్చన్నారు. జ్వరం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా PHCని సంప్రదించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ANM కళావతి, ఆశ కార్యకర్తలు మహేశ్వరమ్మ, సునీతమ్మ అంగన్వాడీ టీచర్ రేణుకమ్మ పాల్గొన్నారు.