కర్నూలు, నిఘా న్యూస్:బాల్యం ఒక వరం.. ఎలాంటి బాధలు, బాధ్యతలు లేకుండా సాఫీగా సాగిపోవాల్సిన సమయం. అందుకే జీవిత ప్రయాణంలో బాల్యాన్నే ప్రతీ ఒక్కరూ ఎంతో ఇష్టపడుతుంటారు.అయితే అందరికీ బాల్యం ఇలాగా అందంగా ఉంటుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. విధి వెక్కిరించడమో, తల్లిదం డ్రుల పొరపాటో కారణం ఏదైనా.. సంతోషంగా సాగాల్సిన బాల్యం కష్టాలమయం అవుతుంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుకున్న ఓ సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దీనిపై ఏకంగా మంత్రి నారా లోకేష్ స్పందించారు.ఓ బాల గాంధీ,నడిరోడ్డుపై కునుకు తీస్తున్న దుస్థితిని చూసి మంత్రి నారా లోకేశ్ చలించిపోయారు. కర్నూలులో రోడ్డు పక్కన భిక్షుటన యాచిస్తూ దయనీయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి..
మంత్రి లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ సంతోష్ కుమార్ అనే ఓ నెటిజన్ భిక్షాటనం చేస్తున్న ఓ చిన్నారి వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.