Thursday, March 5, 2026

నేడు బాబ్లీ గేట్లు ఎత్తివేత

తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీల నీరు కిందకు వదులుతారు..గోదావరి నదీ ప్రవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తాసిల్దార్ .పవన్ చంద్రమహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను అధికారులు ఈరోజు ఎత్తనున్నారు. కేంద్రజలవనరుల సంఘం ఒప్పందం మేరకు జూలై 1వ తేదీన ఏటా తెరుస్తారు. 120 రోజుల పాటు ఈ గేట్లు తెరిచి ఉంటాయి. తిరిగి అక్టోబరు 29న మూసివేస్తారు. గేట్ల ఎత్తివేతతో నిజామాబాద్‌ , నిర్మల్ జిల్లా బాసర మీదుగా నీరు రాష్ట్రంలోకి ప్రవేశించి దిగువన ఉన్న శ్రీరామ్​సాగర్‌ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తుంది. గేట్లు ఎత్తడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్.పవన్ చంద్ర గోదావరి నది పరివాహక ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రతి ఏడాది జులై 1 నుంచి అక్టోబర్​ 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తుతారు.అక్టోబర్​29 నుంచి జూన్​30 దాకా మూసి ఉంచుతారు.మధ్యలో మార్చి 1న మాత్రం తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీలను కిందకు వదులుతారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular