పేద పిల్లలకు బట్టల పంపిణీలో టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి
రాయచోటి ( అన్నమయ్య జిల్లా )(నిఘా న్యూస్):గత 13 సంవత్సరాలుగా ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అయ్యప్ప సేవా సొసైటీ వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలకు బట్టలు పంపిణీ చేయడం అందరికీ ఆదర్శనీయం అని మంత్రి సోదరుడు,రాయచోటి నియోజకవర్గ టిడిపి నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు.గురువారం రాయచోటి పట్టణ పరిధిలోని సుద్దలవాండ్లపల్లె రోడ్డులో గల మణికంఠిగిరిపై అయ్యప్ప సొసైటీ వారి ఆధ్వర్యంలో పేద పిల్లలకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేద పిల్లలు కూడా సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని రాయచోటి నియోజకవర్గ పరిధిలోని గాలివీడు మండలంలోని టంటంవారిపల్లి,సంబేపల్లి మండలంలోని గురిగింజకుంట హరిజనవాడ,వీరబల్లి మండలంలోని మట్లి కొత్తపల్లి,మట్లి రెడ్డివారిపల్లి,సంఘం వాండ్లపల్లె,రాయచోటి మండలంలోని గుంటిమడుగు,వరిగపాపిరెడ్డిగారిపల్లె,బొట్ల చెరువు,ఎగువ అబ్బవరం హరిజనవాడ పాఠశాలల్లో చదువుతున్న 250 మంది పేద విద్యార్థులకు కొత్త బట్టలు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు.ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకొని ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడమే కాకుండా పేద పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు కొండూరు శ్రీనివాసరాజు,టిడిపి నేత సురేష్ రెడ్డి,అయ్యప్ప సేవా సొసైటీ అధ్యక్షులు బసిరెడ్డి స్వామి,సభ్యులు మల్లన్న,మురళీమోహన్ రాజు,సురేష్ నాయుడు,రమేష్,ఆంజనేయులు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.



