గన్నేరువరం, మార్చి 24 ( నిఘా న్యూస్ ): ప్రభుత్వం ఉగాది పండుగ నుండి రేషన్ కార్డు దారులకు అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ పై సోమవారం మండల కేంద్రము లోని తహశీల్దార్ నరేందర్ సూచన మేరకు మండల పరిధిలోని ఆయా గ్రామాల రేషన్ డీలర్లకు డిప్యూటీ తహశీల్దార్ నరసింహాచారి, ఆరైలు రజనీకాంత్ రెడ్డి, రఘు లు డీలర్లకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు ఉగాది నుండి పంపిణీ చేయాలని నిర్ణయించింది కాబట్టి అన్ని రేషన్ షాపులకు సరఫరా చేస్తున్నదని, గత నెల నిల్వ బియ్యం షాపుల్లో ఉంటే పంపిణీ చేయవద్దని, సన్న బియ్యం మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేయాలని , సమయపాలన పాటించాలని, రేషన్ షాపుల్లో పరిశుభ్రత పాటించాలని రేషన్ డీలర్లకు సూచించారు.ఆయా గ్రామాల రేషన్ కార్డు దారులు సద్వినియోగం చేసుకోవాలని , సన్న బియ్యం పంపిణీ క్రమంలో రేషన్ కార్డు దారులు డీలర్లకు సహకరించి, అందరూ సన్న బియ్యం తీసుకుని పోవాలని రేవెన్యూ అధికారులు రేషన్ కార్డు దారులను కోరారు. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బోడ ప్రతాప్ రెడ్డి, విభూతి వీర కుమార్, చింతల సంపత్, చాడ బాపి, రమేష్, శంకరయ్య, ఆంజనేయులు , ఆయా గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
సన్న బియ్యం పంపిణీ పై రేషన్ డీలర్లకు అవగాహన
RELATED ARTICLES