Sunday, August 3, 2025

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం!

న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్:ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ నేడు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నా రు.ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేతను ముఖ్యమంత్రిగా చేస్తున్న ట్లుగా సమాచారం.కేజ్రీవాల్. ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్ప వచ్చు. దీంతో తన పార్టీలో కుటుంబ పాలన ఉండదని ప్రూవ్ చేశారు. కేజ్రీవాల్. లిక్కర్ స్కాము కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తప్పు చేశారో లేదో అన్న విషయాన్ని పక్కన పెట్టినట్లయితే…ఆప్ నేత అతిషీని సీఎం పీఠంపై కూర్చోబెడుతుం డటం గొప్పవిషయంగా చెప్పవచ్చు. మన దేవంలో చాలా పార్టీలు, కుటుంబ పార్టీలే ఉన్నాయి. తమ తర్వాత తమ కుటుంబీ కులే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో చాలా మంది నేతల ఉన్నారు.

కానీ కేజ్రీవాల్ దీనికి భిన్నమని నిరూపించారు. తాను వైదొలిగిన తర్వాత తన భార్య కాకుండా..పార్టీ లో మంచి పేరున్న నేతను సీఎంగా ప్రకటించడం దీనికి నిదర్శనం. నేడు మధ్యా హ్నం 4.30గంటలకు రాజ్ నివాస్ లో అతిషీ…ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు…ఆమెతోపాటు మరో ఐదుగురు ఆప్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఢిల్లీ అనేది పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో..అతిషీని ముఖ్యమంత్రిగా రాష్ట్రపతి ద్రౌపది నియమించారు.ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈమధ్యే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అతిషీ ముఖ్యమంత్రి కాబోతున్నారు.అయితే ఈ కార్యక్రమం సాదాసీదాగా సాగిపో నుంది. ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి అవ్వడం కంటే ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు బాగలేకపోవ డం ప్రధాన అంశంగా చెప్పవచ్చు.కేజ్రీవాల్ రాజీనామా చేయడం ఆప్ నేతలకు నచ్చలేదు. మన సమయం బాలేదు ఆర్భాటాలు చేయకూడదు అనుకుంటూ సర్ధుకుపోతున్నారు…

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular