Wednesday, August 6, 2025

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు!

హైదరాబాద్, నిఘా న్యూస్: త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించా లని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం అసెంబ్లీని నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది,

ప్రధానంగా తెలంగాణలో అత్యంత చర్చనీయాంశం గా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో రూపొం దించిన ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమో దించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు.

సీఎం రేవంత్ మాట్లాడు తూ…కమిషన్ నివేదికలోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాము. ఈ నివేదికను త్వరలోనే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పార్టీలకు తమ అభిప్రాయా లను వెల్లడించే అవకాశం కల్పిస్తాం అని తెలిపారు.

ఆయన స్పష్టం చేస్తూ..ఈ నివేదిక ఎవరిపైనా కక్షసాధింపు కోసం కాదు. ప్రజాహిత దృష్టితోనే ఈ చర్యలు చేపడుతున్నాం, అన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ నివేదికపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం ఈ నివేదికను తయారు చేయలేదు. ఇది స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ సమర్పించిన నివేదిక,” అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ప్రజలకు స్పష్టత కల్పించడమే ఈ కమిషన్ ఉద్దేశమని పేర్కొన్నారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంలో జరిగిన తీరుతెన్నులు ప్రజాధన దుర్వినియోగానికి దారితీ శాయి. నిపుణుల విశ్లేషణల ప్రకారం, సుమారు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి, కమిషన్ సూచనల అమలుకు తగిన చర్యలు చేపట్టనుంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular