కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సై గా విధులు నిర్వహిస్తున్న మార్కొండ కిషన్ (59) బుధవారంనాడు కరీంనగర్ జ్యోతినగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. 1984 బ్యాచ్ కి చెందిన ఏఎస్సై కిషన్ గారు 40 సంవత్సరాలు సుదీర్ఘ కాలంపాటు పోలీస్ శాఖలో సేవలందించారు. అతని ఉత్తమ సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అతి ఉత్క్రిష్ట సేవా పథకాన్ని ప్రకటించిగా, కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ చేతుల మీదుగా అందుకున్నారు. మృతుడికి భార్య , ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు వున్నారు. అంత్యక్రియలు వారి స్వగ్రామమైన తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో జరగనున్నాయి.
గుండెపోటుతో ఏఎస్సై మృతి
RELATED ARTICLES