Monday, August 4, 2025

మత్స్య శాఖ లో నామినేటెడ్ ఛైర్మెన్ల నియామకాలు రద్దు చేయాలి

సంగారెడ్డి 17 ( నిఘా న్యూస్) ఇటీవల రాష్ర్టంలో వో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మత్స్యకారులకు కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు గున్నాల నర్సింలు అన్నారు. మత్స్యసహకార సంఘాలకు చైర్మన్ల నామినేటేడ్ పద్దతి చేర్మెన్లను నియమించటం సరైయిoది కాదని తెలిపారు. గత ప్రభుత్వంలో మత్స్య సహకార సంఘం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.33 జిల్లా సహకార సంఘలకు ఎన్నికలు జరుపాలనీ డిమాండ్ చేశారు. నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామిక స్ఫూర్తికి, సహకార వ్యవస్థ నియమ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమన్నారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువతా నాటి నుంచి గడచిన పది సంవత్సరాలుగా రాష్ట్రంలో మత్స్య సహకార సంఘాల వ్యవస్థను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం బి అర్ ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు.అదే సాంప్రదాయాన్ని, పద్ధతులను కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయడం సరి కాదని అన్నారు. ప్రజాసస్వామిక పద్ధతిలో సహకార చట్టాల ప్రకారం 33 జిల్లాలలో ఎన్నికలు నిర్వహించిమత్స్యశాఖ కార్పొరేషన్ పాలక మండలిని నియమించాల్సి ఉందనీ అన్నారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఇప్పటికే అడహాక్ (తాత్కాలిక) కమిటీలను ఎంపిక చేకోన్నరని తెలిపారు.జిల్లా సహకార సంఘాల నమోదు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందనీ తెలిపారు.కొన్ని జిల్లాలలో సహకార సంఘాలకు ఎన్నికలు పూర్తిస్థాయి జరిగియన్నారు.

మిగిత జిల్లాల్లో అన్నింటికీ పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్రస్థాయి పాలక మండలిని నియమించవలసి ఉందని అన్నారు.మళ్లీ నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ ను నియమించడం చట్టవిరుద్ధమనన్నారు..వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకొని, నామినేటెడ్ చైర్మన్ ను నియమించే పద్ధతికి స్వస్తి పలుకాలని పేర్కొన్నారు.ప్రజాస్వామికంగా అన్ని జిల్లాలకు జిల్లా సహకార సంఘాల ఎన్నికలను పూర్తిచేసి, రాష్ట్ర మత్స్య సహకార సంఘాల పూర్తిస్థాయి పాలక మండలిని ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేశారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా మత్స్యశాఖ సంఘాలకు సంబంధించి 6300 సొసైటీలు ఉండగా ముదిరాజులకు చెందిన సంఘాలు అధికంగా 4500, గూల్ల ,బెస్త ,గంగపుత్ర వారికి సంబంధించినవి 1200 సొసైటీలు మాత్రమే ఉన్నాయన్నారు.అలాగే ఎస్సీ ఎస్టీ ఇతర కులాలకు చెందినవి 600 ఉన్నాయి.. రాష్ట్రంలోని 33 జిల్లాలల్లో 25 జిల్లాలలో ముదిరాజ్ కులాలకు చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు ఎన్నికైయి ఉన్నారన్నారు.బెస్త, గంగపుత్ర ,గుళ్ళ ,ఇతర కులాలకు చెందిన వారు ఎనిమిది జిల్లాల్లో 8 ఉన్నారని తెలిపారు.మంది రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ఉన్న ముదిరాజ్ కులాలకు చెందిన సొసైటీ అధ్యక్షులను ఉన్నారని పేర్కొన్నారు.

అధిక మెజారిటీ ముది రాజ్ సొసైయిటి సభ్యులు ఉన్నారని తెలిపారు. వారని విస్మరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్కువ సంఖ్యలో ఉన్న బెస్త కులానికి చెందిన మత్స్య శాఖలో ఎలాంటి సభ్యత్వం లేని వ్యక్తి మెట్టు సాయికుమార్ ను మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఎలా నియమిస్తారని ప్రశ్ననిoచారు.వెంటనే ఆ ఛైర్మె నియామక ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్ కు మత్స్య శాఖలో సభ్యత్వం కలిగి ఉన్నవారినే మత్స్యశాఖ చైర్మన్లు నియమించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్స్ తెనుగు రమేష్ ముదిరాజ్ జెం. నాగరాజు ముదిరాజ్ , చపల హనుమంతు , నీరుడి ఆగమయ్య , గ్యారాల శ్రీనివాస్ , T లక్ష్మణ్ , వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular