హైదరాబాద్, నిఘా న్యూస్: తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు నియమకాలకు ముహూర్తం ఖరారైంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేరోజు అధిష్టానం అధ్యక్షులను ప్రకటించ నుంది, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
దీని కోసం సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు జూలై 1న ఎన్నికలు నిర్వహిస్తారని,బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు. జులై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అదే రోజున అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీ తీవ్ర పోటీ నెలకొంది. ఈ మేరకు పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో ఎప్పటి నుంచో లాబీయింగ్ మొదలు పెట్టారు. ఈ జాబితాలో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్ ఉన్నట్లుగా బీజేపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.
అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి తిరిగి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోటీలు ఉన్న నేతలంతా బయటకు తాము రేసులో లేమని చెబుతున్నా.. లోలోపల పదవీ కోసం తీవ్రంగా లాబీయింగ్‌లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తోందనని బీజేపీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణ నెలకొంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.