శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధం
ఇల్లందకుంట, ఏప్రిల్ 14 (నిఘాన్యూస్): అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారా మచంద్ర స్వామి దేవాలయం శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రారంభమైన బ్రహ్మోత్స వాల్లో భాగంగా 17న శ్రీరా మనవమికి భక్తులు దాదాపు లక్షమంది వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఈ క్షేత్ర మహత్యం..
త్రేతాయుగమున సీతారామ లక్ష్మణ మేతుడై రామచంద్రుడు అరణ్యవాసము న సేద తీర్చుకున్న సమయంలో తండ్రిదశరథమ మహారాజుని మరణ వార్త విని దక్కించుతుండగా ఇల్లంద గింజల తో శాద్దకర్మ లోనరించినట్లు నేటికీ ఇక్క డ చెక్కుచెదరకుండా ఇల్లంద వృక్షముల సాక్ష్యాలతో అవతరించినట్లు చెబుతారు. అందుకే ఈ గ్రామానికి ఇల్లందకుంట పేరు వచ్చినట్లు ఆలయ అర్చకులు పేర్కొంటారు. ఉత్సవమూర్తులకు పుట్టు మచ్చలు ఉండడం ఇక్కడి ఆలయ ప్రత్యే కత, రాముడు అరణ్యవాసంలో భాగం గా చుట్టుపక్క గ్రామాల్లో సంచ రించా రని ఇక్కడి పూర్వీకులు, పెద్దలు చెబు తుంటారు. అందుకే ఈ గ్రామాలకు లక్ష్మాజిపల్లి, శ్రీరాములపల్లి, లక్ష్మన్న ల్లె, సిరిసేడు, సీతంపేటలుగా పేర్లుఉన్నాయి.

ఇప్పటికే ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతీ, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆల య నిర్వహణ అధికారి కందుల సుధా క ర్ అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవ మికివచ్చే భక్తులకు జమ్మికుంట రైస్ మిల్ రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 108 104 వాహనాలను వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలో తలెత్తకుండా వాహనాల పార్కింగ్ ఇబ్బందులు కలగ కుండా హయిురాబాద్ ఏసిపి శ్రీనివాస్, జమ్మికుంట రూరల్ సిఐ కిషోర్, ఎస్సై రాజ్కుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు కల్యాణ మహోత్సవం
-కందుల సుధాకర్, ఆలయ ఈఓ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా 17వ తేదీన ఉదయం 9 గంటలకు ఎదుర్కోళ్లతో మధ్యాహ్నం 12 గంటల కు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్స వం నిర్వహిస్తాం. రాత్రి 11 గంటలకు ఉత్సవమూర్తులను శేషా వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు.