కరీంనగర్ రూరల్, (నిఘాన్యూస్):మండలంలోని తీగలగుట్టపల్లిలో చెందిన వర్షిణికి పురిటి నొప్పులు రావడంతో ప్రసూతి కోసం కరీంనగర్లోని శ్రీ లత ఆసుపత్రిలో వారం రోజుల క్రితం అడ్మిట్ అయి ఓ బాబుకు జన్మనిచ్చింది. కాగా డెలివరీ చేసిన ఆరు రోజులకు ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందిందని మృతురాలి బంధువులు శ్రీ లత ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నిన్నటి వరకు బాగానే ఉన్నా వర్షిణి డాక్టర్ల నిర్లక్ష్యం వలననే చనిపోయిందని చట్టపరమైన విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. ఈ విషయం పై డాక్టర్ లను వివరణ కోరగా తమకేం సంబంధం లేదని దాటవేశారు.
గర్భినీ మృతిపై ఆసుపత్రి ఎదుట ఆందోళన
RELATED ARTICLES